Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నయీంనగర్
వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి 4 నాటికలు అలరిస్తునే ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని ప్రభుత్వ డైట్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ రవికుమార్ అన్నారు. వరంగల్ అర్బన్, రూరల్, జనగామ, మహబూబాబాద్ నుంచి జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతి పొంది, ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలకు వచ్చిన నాలుగు నాటికలు పర్యావరణం సైన్స్‌పై ఆలోచింపజేసే విధంగా ఉన్నాయన్నారు. జిల్లా సైన్స్ అధికారి సీహెచ్ కేశవరావు మాట్లాడుతూ నాలుగింటిలో ప్రథమ బహుమతి పొందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల మర్కాజీ వరంగల్ అర్బన్ జిల్లా ఈ నెల 19న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారన్నారు. మహబూబాబాద్ జిల్లా కాల్వల టీఎస్ మాడల్ స్కూల్ ద్వితీయస్థానం దక్కించుకోగా(సేవ్ మీ నాటిక), వరంగల్ రూరల్ జిల్లా జడ్పీఎస్ పెద్దకోడెపాక తృతీయస్థానం, యూపీఎస్ బండనాగారం జనగామ జిల్లా నాల్గవ స్థానంలో ఉన్నాయన్నారు. ఈ పోటీలకు రంగస్థల నటులు తుపాకుల మొగిలి, బుర్ర విద్యాసాగర్, బుర్ర నటరాజ్‌లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. డైట్ లెక్చరర్లు సోమయ్య, అమరేందర్, గైడ్ టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు.