Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
మండలంలోని చెల్పూర్లో శనివారం మావోయిస్టుల వాల్‌పోస్టర్ కలకలం రేపింది. టీఆర్ఎస్ పార్టీ నాయకుల్లారా ఖబడ్దార్, మీరు చేసే ఆగడాలకు అద్దు లేకుండా పోతున్నాయంటూ వాల్ పోస్టర్లో పేర్కొన్నారు. కొత్త వెంకటేశ్వర్లు, కోల రవీందర్‌గౌడ్, రేపాక రాజేందర్ మీరు పద్ధతులు మార్చుకోకుంటే తగిణ పాఠం చెప్పాల్సి వస్తుందని మావోయిస్టు పార్టీ జె శంకర్ పేరుతో వాల్‌పోస్టర్ వెలిసింది. దీంతో మండల కేంద్రంలో ఒక్కసారిగా కలకలం రేగింది.