Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిక్కుకున్న అంబులెన్స్
నవతెలంగాణ-మహాదేవపూర్
మండలంలోని బొమ్మాపూర్ వద్ద శనివారం తెల్లవారుజామున లారీ బోల్తా పడడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో అంబట్పల్లి నుంచి మహాదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తున్న అంబులెన్స్ ట్రాఫిక్ జామ్లో చిక్కుకుంది. రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రతి రోజు ఇసుక లారీలతో పాటు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి కంకెర లోడుతో పాటు ఇతర సామాగ్రితో వెళ్లే వందలాది లారీల వలన తరచు ఇటువంటి ప్రమా దాలు జరుగుతుండడంతో బొమ్మాపూర్ నుండి సూరా రం వరకు వారానికి 2, 3 రోజులు ట్రాఫిక్ జామ్ అవు తోంది. ఇప్పటికైనా మహా దేవపూర్ నుంచి పలిమెల వరకు మంజూరైన డబుల్ రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేసి రవాణా సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.