Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
నెక్కొండ మండలంలోని 39 పంచాయతీల్లో 12 సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి అన్ని స్థానాల్లోను తమ పార్టీ అభ్యర్థులు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యేలా చేసుకుని ఆధిక్యతను చాటుకున్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికైన అభ్యర్థుల వివరాలు వెల్లడయ్యాయి. నామినేషన్ల ప్రక్రియ సాగుతున్న క్రమంలోనే 8 పంచాయతీల్లో టీఆర్ఎస్ బలపర్చిన ఒక్కో అభ్యర్థే నామినేషన్ వేయడంతో ఇక్కడ ఏకగ్రీవ ఎన్నిక లాంఛనప్రాయమైంది. నామినేషన్ల ఉప సంహరణ రోజు ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు జరుపి ఓ అవగాహనకు రావడంతో మరో నాలుగు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అయితే ఈ ఎన్నికలను అధికార యంత్రాంగం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.