Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గంజాయి కేసు..?
నవతెలంగాణ-కాజీపేట రూరల్
కాజీపేట పోలీసుల అదుపులో ఒక యువకుడు ఉన్నట్లు తెలిసింది. పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో కడిపికొండ గ్రామానికి చెందిన ఓ యువకుడు ద్విచక్రవాహనంపై అతివేగంగా శబ్దాలు చేస్తూ ప్రయాణిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడి సెల్ఫోన్లో గంజాయి తాగుతున్న దశ్యాలు, మెసేజ్లు పోలీసులకు లభించినట్లు సమాచారం. పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నట్లు తెలిసింది.