Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నర్సంపేట : తెలంగాణ ముస్లిం మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ స్పాన్సర్షిప్ ద్వారా నిరు పేద యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడానికి శిక్షణ ఇస్తున్నట్టు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్సస్ట్రక్షన్ (న్యాక్) అసిస్టెంట్ డైరెక్టర్ డి గోపాల్ తెలిపారు. 18 నుంచి35 సంవత్సరాలలోపు యువతకు 3నెలల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి నిర్మాణ రంగంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో మధ్యాహ్న భోజనం, సేప్టీకి సంబంధించి హెల్మెట్, షూస్, ఆఫ్రాన్, స్టేషనరీ ఐటెమ్స్ ఇస్తామని, శిక్షణ అనంతరం న్యాక్ సర్టిఫికెట్, ఎన్ఎస్డీఎస్ వారిచేత ఎన్సీవీటీ సర్టిఫికెట్ కూడా జారీ చేస్తామని తెలిపారు.