Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హమాలీల ఆవేదన
నవతెలంగాణ-మహదేవ్పూర్
పొద్దంతా పని చేసినా కూలీ గిట్టడం లేదని హమాలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని మహదేవ్పూర్, సూరారం, రాపెల్లికోట, అంబటిపల్లి, బెగులూరు, బొమ్మాపూర్, కాళేశ్వరం, అన్నారం గ్రామాలలో ప్రతి హమాలీ సంఘంలో 20 నుండి 30వరకు సభ్యులుగా ఉన్నారు. అయితే వీరు ప్రతిరోజూ పని కోసం ఎదురుచూస్తూ ఉంటారు. లారీలు రాకపోవడంతో ఇటు హమాలీ పని చేయలేక, అటు కూలీ పనికి పోలేక, పొద్దంతా ఖాళీగా ఉంటున్నామని హమాలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని సుమారు 500మంది హమాలీలు ఐకేపీ కళ్లాల వద్ద రైతులు మాములుగా అమ్ముకునే బస్తాలు, మిర్చి బస్తాలతో పాటు మహదేవ్పూర్ మండల కేంద్రంలో గిరిజన సోసైటీ ద్వారా వివిధ గ్రామాలకు చేరవేసే బియ్యపు బస్తాలతో పాటు గ్యాస్ గోదాం నుంచి లోడ్ చేయడం, దిగుమతి చేస్తారు. మండల కేంద్రంలో గిరిజన ఆదివాసీ హమాలీ సంఘంలో 21మంది సభ్యులుండగా ప్రతి రోజు వీరికి పని లేకుండా హమాలీ సంఘం కార్యాలయానికి చేరుకుని ఖాళీగా కూర్చుంటు న్నారు. హమాలీ పని చేస్తే రోజుకు మాములుగా రూ.200నుంచి రూ.250 వసా ్తయని, అదే కూలీ పనికి వెళ్తే రూ.400వస్తాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ లోడ్ దిగుమతి చేస్తే రూ.1225, ఎగుమతి చేస్తే, బియ్యం లోడ్, అన్లోడ్ చేస్తే రూ.18 ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర గ్రామాలలో హమాలీ సంఘం సభ్యులు పత్తి, మిర్చి, ఐకేపీ కేంద్రాల వద్ద వరి ధాన్యం లోడ్ చేయడం వంటి పనులు చేస్తున్నప్పటికీ హమాలీ సంఘంలో సభ్యునిగా ఉన్న వారు తప్పనిసరిగా పనికి రావాలని చెప్తే పనికి పోతే ఆ రోజు లోడ్ చేయకపోతే పొద్దంతా ఖాళీగా ఉండి ఇటు వ్యవసాయం పనులు లేక ఖాళీగా ఉంటున్నామని వారు ఆరోపిస్తున్నారు. మాకు ఏదైనా ప్రమాదాలు జరిగినప్పటికీ ఎవరూ సహాయం అందించడం లేదని వారు తెలిపారు.
ప్రమాదం జరిగిన వారిని ఆదుకోవాలి : కాల్నేని రాములు (గిరిజన ఆదివాసీ హమాలీ సంఘం అధ్యక్షుడు)
హమాలీ పని చేస్తున్న సమయంలో ఏదైనా ప్రమా దవశాత్తు ప్రమాదం జరిగితే ఇటు యజమాని, అటు ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలి. హమాలీలకు సరియైన శ్రమకు తగ్గ వేతనాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మండ లంలోని అనేక గ్రామాలలో హమాలీలకు లోడ్ చేయగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఇంత వరకు యజమాని, ప్రభుత్వాలు ఆదుకోవడం లేదు.
కూలీ గిట్టడం లేదు : పంచిక మల్లేష్, హమాలీ సంఘం నాయకులు
హమాలీ సంఘంలో పని చేస్తున్నామని పేరుకే తప్ప రోజువారీగా కూలీ గిట్టడం లేదు. ప్రతి రోజు లారీ వస్తుందని చెప్పి అందరినీ పిలవగానే వస్తున్నప్పటికీ లారీ రాక మధ్యలో ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం హమాలీలకు కూడా గౌరవ వేతనం ఏర్పాటు చేసి హమాలీ సంఘం సభ్యులను ఆదుకోవాలి.