Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూపాలపల్లి జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి
నవతెలంగాణ-మహదేవ్పూర్
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను బతుకమ్మ పండుగ తెలియజేస్తుందని భూపాలపల్లి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి అన్నారు. ఆదివారం గ్రీన్వుడ్ కాన్సెప్ట్ స్కూల్లో జరుగుతున్న ముందస్తు ఎంగిళి పూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. బతుకమ్మ మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా ప్రపంచం నలుమూలల్లో కూడా విస్తరించిందని తెలిపారు. బతుకమ్మ పండుగను గ్రీన్వుడ్ పాఠశాలలో ఏర్పాటు చేయడం పట్ల స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బి.రాణిబాయిరామారావు, జెడ్పీటీసీ గుడాల అరుణశ్రీనివాస్, సర్పంచ్ శ్రీపతి బాపు, గ్రీన్వుడ్ కాన్సెప్ట్ స్కూల్ కరస్పాండెంట్ చీర్ల శ్రీనివాస్‌రెడ్డి, హెచ్ఎం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.