Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సద్దుల బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆడబిడ్డలకు అందజేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశామని ఈఓపీఆర్డీ సరస్వతి తెలిపారు. బతుకమ్మ చీరల పంపిణీ గురించి ఆమె నవతెలంగాణతో ముచ్చటించారు.
నవతెలంగాణ-శాయంపేట
మండలంలో చీరల పంపిణీ కార్యక్రమం ఎప్పటి నుంచి చేపడుతున్నారు ?
మండల పరిధిలోని 24 గ్రామ పంచాయతీల్లో ఈ నెల 25న వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ రోజు నుంచి అర్హులైన మహిళలందరికీ అక్విటెన్స్ జాబితా ప్రకారం తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఆధారంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తాం.
మండలానికి ఎన్ని చీరలు మంజూరయ్యాయి ?
మండల పరిధిలోని 24 గ్రామ పంచాయతీల్లో 30 రేషన్ షాప్లు ఉన్నాయి. తెల్లరేషన్ కార్డు ఆధారంగా 18 ఏళ్లు పైబడిన మహిళలు 15 వేల 419 మంది అర్హులైన వారు ఉన్నారు. రేషన్ షాప్ 1లో 547 మంది ఉండగా.. షాప్ 2లో 544, షాప్ 3లో 252, షాప్ 4లో 146, షాప్ 5లో 687, షాప్ 6లో 259, షాప్ 7లో 894, షాప్ 8లో 718, షాప్ 9లో 503, షాప్ 10లో 721, షాప్ 11లో 438, షాప్ 12లో 427, షాప్ 13లో 554, షాప్ 14లో 525, షాప్ 15లో 647, షాప్ 16లో 780, షాప్ 17లో 398, షాప్ 18లో 354, షాప్ 19లో 486, షాప్ 20లో 620, షాప్ 21లో 601, షాప్ 22లో 493, షాప్ 23లో 711, షాప్ 24లో 474, షాప్ 25లో 446, షాప్ 26లో 444, షాప్ 27లో 488, షాప్ 28లో 492, షాప్ 29లో 487, షాప్ 30లో 295 మంది 18 ఏండ్లకు పైబడిన అర్హులైన మహిళలు ఉన్నారు. ఈ జాబితాను డీఆర్డీఏకు పంపించగా 20 శాతం కోత విధించగా మిగిలిన చీరలు మాత్రం వచ్చాయి. పంపిణీ పూర్తయ్యాక అర్హులైన వారు ఉన్నట్లయితే జాబితా తయారు చేసే డీఆర్డీఏకు పంపించి చీరలు తీసుకొచ్చి పంపిణీ చేస్తాం.
పంపిణీలో ఏ అధికారులు పాల్గొంటారు ?
ప్రతి గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో పంపిణీ కార్యక్రమం చేపడతాం. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, రేషన్ డీలర్, వివో సంఘం అధ్యక్షురాలు పాల్గొంటారు.
30 రోజుల ప్రణాళిక కార్యక్రమం ఏవిధంగా కొనసాగుతోంది ?
ప్రభుత్వం అమలు చేస్తున్న 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక మండల పరిధిలోని 24 గ్రామ పంచాయతీల్లో సక్రమంగా అమలవుతోంది. చిన్న గ్రామాల్లో పారిశుధ్య పనులు 100 శాతం పూర్తికాగా.. మేజర్ గ్రామాల్లో 60 శాతానికి పైగా పూర్తయ్యాయి. గతంలో ఎక్కడి చెత్త అక్కడే వేయడం, పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడంతో తొలగించడం కష్టతరమవుతోంది. పారిశుధ్య కమిటీలు, వార్డు సభ్యులు కొన్ని గ్రామాల్లో పాల్గొనడం లేదు. గ్రామ అభివద్ధిలో ప్రజా ప్రతినిధులు, పారిశుధ్య కమిటీ సభ్యులు, గ్రామస్తులు భాగస్వాములైతేనే కార్యక్రమం విజయవంతం అవుతుంది. పత్తిపాక, పెద్దకొడపాక, గట్లకానిపర్తి గ్రామాల్లో చెత్త కుండీలు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు గ్రామ స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో వేగంగా కొనసాగుతున్నాయి.
మండలాన్ని ఎన్ని రూట్స్ గా విభజించారు?
2 రూట్స్ గా విభజించాము. ఒక రూటును ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఎన్ శ్రీలత పర్యవేక్షించగా, మరో రూటును నేను పర్యవేక్షిస్తాను. గట్లకానిపర్తి గ్రామానికి 979 చీరలు రాగా, సూరంపేట 227, తహరాపూర్ 840, కొత్తగట్టు సింగారం 427, శాయంపేట 2423, మైలారం 779, పత్తిపాక 1410, హుస్సేన్పల్లి 131, ప్రగతి సింగారం 640, నేరేడుపల్లి 649, గోవిందాపూర్ 358, పెద్దకొడపాక 1284, జోగంపల్లి 311, కొప్పుల 1451, వసంతపూర్ 400 ,గంగిరేని గుడెం 453, సాదోనిపల్లి 266, కాట్రపల్లి 618, రాజుపల్లి 233, మొత్తంగా 13,877 చీరలొచ్చాయి.