Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిగ్రీ కాలేజీల అనుమతుల్లో అక్రమాలు
నవతెలంగాణ-వరంగల్
డిగ్రీ కాలేజీలకు అనుమతులిచ్చే విషయం లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. మౌలిక వసతులు లేకపోయినా అనుమతులి వ్వడంతో కొన్నేండ్లుగా కళాశాలలను యథేచ్ఛగా నడిపిస్తున్నారు. భవనాలు, ఆట స్థలం, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ తదితర ఏర్పాట్లు లేకుండానే సంబంధిత యజమానులు కళాశాలలను కొనసా గిస్తున్నారు. మామూళ్లకు అలవాటు పడిన కొందరు విద్యాశాఖ అధికారులు పట్టించుకోవట్లే దని పలువురు ఆరోపిస్తున్నారు. ఇందుకు వరంగల్ నగరంలోని పలు డిగ్రీ కళాశాలలనే నిదర్శనం.
నగరంలో జూనియర్, డిగ్రీ కాలేజీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అపార్ట్మెంట్లలో కాలేజీలు ప్రారంభిస్తున్నారు. కళాశాల వైశాల్యం తో 20శాతం స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయిం చాల్సి ఉండగా.. అవేమీ కానరావట్లేదు. డిగ్రీ కాలేజీలకు ప్లే గ్రౌండ్లని బోర్డులు మాత్రమే దర్శనమిస్తున్నాయి. ఉన్నత విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం వల్లే ఈ దుస్థితి నెలకొందన్న విమర్శలూ ఉన్నా యి. కొత్త కాలేజీల ఏర్పాటు నేపథ్యంలో తనిఖీలు చేసి వాస్తవ పరిస్థితిని చూసి అనుమతులు ఇవ్వాలి. ఇందుకు భిన్నంగా మొక్కుబడిగా తనిఖీలు చేసి డబ్బులు దండుకొని అనుమతు లిస్తున్న పరిస్థితి. హన్మకొండ పొద్దుటూరి కాంప్లెక్స్ రెండో అంతస్థులోని సిటీ మహిళా డిగ్రీ కాలేజీ, బాలసముద్రంలోని ఎస్ఆర్ మహిళా డిగ్రీ కాలేజీకి ఆట స్థలమే లేదు. 300-400 గజాల స్థలం వద్ద కాలేజీ పేరిట 'ప్లే గ్రౌండ్' అని బోర్డులు రాసి పెట్టారు. ఆ స్థలం వాహనాలు పెట్టుకోవడానికే సరిపోతోంది. సదరు యాజమాన్యాలు ఇప్పటి వరకు ఆటలు నిర్వహించిన దాఖలాల్లేవు. కాలేజీ ప్రాంగణం, కార్యాలయం, ల్యాబ్ల విషయంలోనూ నిబంధనలు పాటించని పరిస్థిథి. ఇప్పటికైనా ఉన్నత విద్యా శాఖాధికారులు స్పందించి తనిఖీలు నిర్వహించాలని, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించేలా తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.