Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడల్ స్కూల్ రాష్ట్ర డైరెక్టర్ రాజీవ్
నవతెలంగాణ-తొర్రూర్ టౌన్
జిల్లాలోని అన్ని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఇంటర్ టెన్త్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా బోధించాలని తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ డైరెక్టర్ రాజీవ్ అన్నారు. మంగళవారం తొర్రూర్‌లోని గుర్తూలో మోడల్ స్కూల్లో ఉపాధాయుఉలు బోధించే తీరుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని అసంపూర్తిగా ఉన్న తరగతి గదుల నిర్మాణాన్ని పూర్తి చేసేలా చూడాలని ఆ శాఖ ఇంజనీర్‌ను ఆదేశించారు.కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సునిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కేసముద్రం రూరల్ : మండలంలోని కల్వల ఆదర్శ పాఠశాలను అకడమిక్ మానిటరింగ్‌లో భాగంగా మోడల్ స్కూల్ డైరెక్టర్ రాజీవ్ సందర్శించారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను పరిశీలించి వారికి తగిన సూచనలు, సలహాలను అందజేశారు. తరువాత పాఠశాల ఆవరణలో ప్రిన్సిపాల్, ఉపా ధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు.
నెల్లికుదురు : నెల్లికుదురు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను మోడల్ స్కూల్ డైరెక్టర్ రాజీవ్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి విద్యార్థుల నోట్బుక్కులను, విద్య నైపుణ్యాలపై పరిశీలించారు.ఈ సందర్భంగా పాఠశాలలో జరుగుతున్న అకాడమిక్ కార్యకలాపాల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.