Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు సామాజిక మాధ్యమ సంస్థలు ఫేస్బుక్, ట్విట్టర్లు ఝలక్ ఇచ్చాయి. కరోనా వైరస్‌కు సంబంధించి ఆయన పోస్టు చేసిన తప్పుడు సమాచారాన్ని ఆయా సంస్థలు తొలగించాయి. తప్పుడు సమాచారాన్ని పోస్టు చేయడం తమ సంస్థ నిబంధనలకు విరుద్ధమని ఫేస్బుక్ ఈ సందర్భంగా పేర్కొంది. ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్‌కు అంతము ముందు రోజున ఇచ్చిన ఇంటర్వ్యూకు చెందిన వీడియోను ట్రంప్ పోస్టు చేశారు. దాదాపు చిన్నారు లందరూ కరోనా నుంచి రోగ నిరోధక శక్తి కలిగి ఉన్నారని ఆయన పేర్కొనడం అందులో ఉంది. ఒక సమూహానికి సంబంధించి ట్రంప్ ఇచ్చిన సమాచారం తమ నిబంధనలకు విరుద్ధమని, ప్రమాదకరమని ఫేస్బుక్ అధికార ప్రతినిధి చెప్పారు.