Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వంద రోజులుగా నో కరోనా !
- ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ
వెల్లింగ్టన్: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్నది. వైరస్‌కు పూర్తి స్థాయి వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రపంచ దేశాలన్నీ కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైరస్‌ను అడ్డుకోవడంతో విఫలమవుతున్నాయి. కానీ న్యూజిలాండ్ మాత్రం ఈ విషయంలో విజయం సాధిస్తూ.. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. గత వంద రోజుల్లో అక్కడ ఒక్క కోవిడ్-19 కేసు కూడా నమోదుకాలేదు. కరోనా కట్టడికి తాము తీసుకుంటున్న మెరుగైన చర్యలే దీనికి కారణమని న్యూజిలాండ్ ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ కేవలం 23 యాక్టివ్ కేసులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి కూడా కరోనా రోగులు దేశంలోకి అడుగుపెట్టే సమయంలో గుర్తించినవే. వీరందరూ ప్రభుత్వ ఆధ్వర్యంలోని కరోనా ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం న్యూజిల్యాండ్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తున్నది. సామాజిక వ్యాప్తిని నిరోధించడంలో న్యూజిల్యాండ్‌ను మిగితా దేశాలు ఆదర్శంగా తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇటీవలే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా బారినపడిన వారి సంఖ్య రెండు కోట్లకు చేరువైంది. ఇప్పటివరకూ 7,30,376 మంది వైరస్ కారణంగా మరణించారు. మొదటి ఐదు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్, ఇండియా, రష్యా, సౌతాఫ్రికా దేశాలున్నాయి. అమెరికాల్లో అత్యధికంగా 51 లక్షల మంది వైరస్ బారినపడ్డారు.అలాగే, 1.65 లక్షల మంది చనిపోయారు. బ్రెజిల్లో 30 లక్షల కేసులు నమోదుతోపాటు లక్ష మంది మరణించారు.