Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: సౌదీ అరేబియాతో పాటు ఇతర అరబ్ మిత్ర దేశాలకు వివాదాస్పద ఆయుధాల అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియోకు అంతర్గత దర్యాప్తులో క్లీన్చిట్ లభించింది. ఆయుధాల ఒప్పందాలకు సంబంధించి ఆయన ఎటువంటి తప్పు చేయలేదని అంతర్గత దర్యాప్తులో తేలిందని పాంపియో కార్యాలయం సోమవారం ప్రకటించింది. అయితే దర్యాప్తునకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. గతేడాది మే నెలలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స(యుఎఇ), జోర్డాన్లకు 810 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాల అమ్మకంలో పాంపియో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. విదేశాంగ శాఖకు చెందిన అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఆయుధాల అమ్మకానికి సంబంధించి మైక్ పాంపియో, విదేశాంగ కార్యాలయం చట్టానికి అనుగుణంగానే పనిచేసిందని పేర్కొన్నారు. ఆ సమయంలో రియాద్, అబుదాబిలకు ఆయుధాల అమ్మకాలను కాంగ్రెస్ సభ్యులు అడ్డుకున్నారు.
యెమెన్లో వైమానిక దాడుల్లో అనేక మంది పౌరులు చనిపోవడం పట్ల ఆగ్రహంగా ఉన్నారు. దీంతో పాటు టర్కీలోని సౌదీ దౌత్య కార్యాలయం వద్ద సౌదీ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గిను హత్య చేయడంవంటి మానవ హక్కుల ఉల్లంఘనపై అసంతప్తి వ్యక్తం చేశారు.