Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరుగులు తీయబోయి పలువురికి గాయాలు
పారిస్ : ఫ్రాన్‌సలోని ఫ్రెంచ్ రివేరా పట్టణంలో ఉన్న విహార ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు పుకార్లు రేగాయి. దీంతో తీవ్ర భయాందోళనతో ప్రజలు పరుగులు తీయడంతో డజన్ల కొద్దీ మందికి గాయాలయ్యాయని, వారంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. దాదాపు 44 మంది గాయపడ్డారు. కేన్స ఫిల్మ ఫెస్టివల్‌కు ఆతిధ్యమివ్వడానికి ప్రసిద్ధి చెందిన ఫ్రెంచ్ రివేరా పట్టణంలో నెలకొన్న భయాందోళలను నివారించేందుకు దాదాపు 100 మంది అత్యవసర సేవలకు చెందిన సిబ్బందిని మోహరించారు. కాల్పులు జరుగుతున్నాయన్న భయాందోళనతో ప్రజలు టేబుళ్ల కింద దాక్కున్నట్లు, భయంతో అన్ని వైపులా పరిగెడుతున్నట్లు ఉన్న వీడియోలను పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.