Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచంలోనే కరోనా టీకా
మాస్కో: కరోనా మహమ్మారి నివారణకు తొలి వ్యాక్సిన్ వచ్చేసింది. రష్యా ఆధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ మేరకు మంగళవారం ప్రకటన చేశారు. కరోనా రోగులకు వినియోగించేం దుకు వ్యాక్సిన్ సిద్ధంగా ఉందని, ప్రయోగంలో భాగంగా తన కుమార్తెకు కూడా ఈ వ్యాక్సిన్‌ను వేయించామని తెచ్చింది. ప్రభుత్వం తరఫున వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదనీ, దీని పనితీరు అద్భుతంగా ఉన్నదని ఆయన చెప్పారు. అవసరమైన అన్ని పరిశోధనలు, టెస్టుల తర్వాతే ఈ వ్యాక్సిన్‌ను విడుదల చేస్తున్నట్టు పుతిన్ వెల్లడించారు. అంతేకాదు.. తన ఇద్దరు కుమార్తెల్లో ఒకరికి ఈ వ్యాక్సిన్ వేయించినట్టు చెప్పారు. టీకా ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి వైరస్ నియంత్రణలోకి వస్తుందన్నారు. 'కరోనా వైరస్‌పై టీకా అభివృద్ధి చేసిన తొలిదేశంగా రష్యా నిలిచింది' అని పుతిన్ ప్రకటించారు. ఈ టీకాకు సంబంధించిన సమాచారాన్ని తనకు ఎప్పటికప్పుడు తెలియచేయాలని దేశ ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మురాస్కోను పుతిన్ ఆదేశించారు. ఈ విపత్కర సమయంలో వాక్సిన్ తయారీకి కష్టపడినవారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచానికి ఈ సమయంలో ఇదొక అవసరమైన ముందడుగుగా ఆయన అభివర్ణించారు. వ్యాక్సిన్ సాధ్యమైనంత త్వరగా అందరికి అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. అక్టోబర్ నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్న డాక్టర్లు, ఇతర సిబ్బందికి ముందుగా ఇదే నెలలో వ్యాక్సిన్ ఇస్తామన్నారు.
గమలేయా రీసెర్చి ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ టీకాలో రెండు వేర్వేరుగా ఇంజెక్ట్ చేసే పదార్థాలు ఉన్నాయి. ఈ రెండు కలిసి శరీరంలో రోగనిరోధక శక్తిని తయారు చేస్తాయి. ఇప్పటికే పలు వ్యాక్సిన్ ప్రయోగాలు వివిధ దశల్లో ఉండగా.. రష్యా మాత్రం ఒక అడుగు ముందుకేసింది. ఈ వారం వాటిని సామాన్య ప్రజలకు ఇచ్చేందుకు సిద్ధమైంది. జూన్ 18న ఈ టీకాపై తొలి ప్రయోగాలు మొదలయ్యాయి. మొత్తం 38 మంది వాలెంటీర్లపై దీనిని ప్రయోగించారు. వీరందరిలో ఇమ్యూనిటీ పెరిగింది. తొలి బందాన్ని జులై 15న డిశ్చార్జి చేశారు. రెండో బందం జులై 20న డిశ్చార్జైంది.