Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిడెన్ రన్నింగ్మేట్గా బరిలోకి
వాషింగ్టన్ : డెమోక్రటిక్ పార్టీ తరఫు అధ్యక్ష అభ్యర్థి జోరు బిడెన్ తన సహచర ఉపాధ్యక్ష అభ్యర్థి (రన్నింగ్ మేట్)గా కమలా
హారిస్‌ను ఎంచుకున్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియా సెనేటర్‌గా ఉన్న ఆమెను ఎంపిక చేయడం ద్వారా బిడెన్ చరిత్ర సృష్టించారు. ఒక పెద్ద పార్టీ తరపున నల్లజాతీయురాలు ఉపాధ్యక్ష పోటీచేయడం ఇదే తొలిసారి. కమల కుటుంబ మూలాలు తమిళనాడులో ఉన్నాయి. అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ హత్యకు వ్యతిరేకంగా భారీయెత్తున ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నల్లజాతీయుల ఓట్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నది. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఓటమికి ఈ ఓట్లు కూడా ఒక ప్రధాన కారణమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. జాతివివక్ష వ్యతిరేక ఆందోళనల పట్ల ఆయన అనుసరిస్తున్న అణచివేత వైఖరి పట్ల నల్లజాతీయులు తీవ్ర ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే.
55 ఏండ్ల కమలా హారిస్‌కు అటు పార్టీతో పాటు ఇటు ప్రజల్లో విపరీతమైన పాపులారిటీ ఉంది. అధ్యక్ష అభ్యర్ధిత్వాన్ని నిర్ణయించే ప్రైమరీ ఎన్నికల్లో బిడెన్‌కు గట్టి పోటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తన మాజీ ప్రత్యర్థి అయిన కమలా హారిస్‌ను బిడెన్ తాజాగా నెంబర్ 2 స్థానమైన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికాలో కరోనా ధాటికి ఇప్పటికే 1.6 లక్షల మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలో అతిపెద్ద రాష్ట్రమైన కాలిఫోర్నియాలో ఆరోగ్య సంకరక్షణ, చట్టం అమలుకు సంబంధించిన అంశాల్లో అమె అనుభవాన్ని వినియోగించుకోవాలని బిడెన్ యోచిస్తున్నారు. ఇదే సమయంలో దేశంలో కరోనా కట్టడిలో విఫలమైన ట్రంప్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది.
పెద్ద బాధ్యత ః కమలా మేనమామ
కమలా హారిస్ బిడెన్‌కు ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఎన్నిక కావడం పట్ల అమె మేనమామ గోపాలన్ బాలచంద్రన్ హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు ఢిల్లీలో ప్రముఖ విద్యావేత్తగా గుర్తింపు ఉన్నది. ఉపాధ్యక్ష అభ్యర్థిగా హారిస్ ఎంపిక కావడం ద్వారా అమె భుజాలపై పెద్ద బాధ్యత పడిందని అన్నారు.