Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వందకోట్ల డోస్ లకు : రష్యా
మాస్కో: సుమారు ఎనిమిది నెలలుగా మానవాళికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ (స్పుత్నిక్ వి)ను కనుక్కున్నామని రష్యా ప్రకటించిన వెంటనే.. దానిని తమకూ సరఫరా చేయాలని ఇతర దేశాలు కోరుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే 20 దేశాలు తమకు ముందే ఆర్డర్లు ఇచ్చాయని వ్యాక్సినేషన్ ప్రాజెక్ట్ కు హెడ్ గా వ్యవహరిస్తున్న
కిరిల్ దిమిత్రియేవ్ ప్రకటించారు. ఆయన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)కు చీఫ్ గా ఉన్నారు. స్పుత్నిక్ వి విడుదల సందర్భంగా కిరిల్ స్పందిస్తూ.. తమకు 20 దేశాల నుంచి 100 కోట్ల డోస్ ల ఆర్డర్లు వచ్చాయని తెలిపారు. జాబితాలో లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆసియా దేశాలు వ్యాక్సిన్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఆ మేరకు పలు దేశాలతో ఒప్పంద ప్రక్రియ కూడా కొనసాగుతున్నదని కిరిల్ అన్నారు. వివిధ దేశాలు ఇచ్చిన వందకోట్ల డోస్ లలో తమకు 50 కోట్ల డోస్ లు చేసే సామర్థ్యమున్నదనీ, మిగిలిన వాటి కోసం 5 దేశాలతో కలిసి తాము పనిచేస్తున్నామని వివరించారు. స్పుత్నిక్ వి మూడో దశ (హ్యూమన్ ట్రయల్స్) పరీక్షలను యూఏఈ, సౌదీ అరేబియా దేశాల్లోనూ నిర్వహిస్తామని కిరిల్ తెలిపారు.