Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బొలీవియా : బొలీవియా అధ్యక్ష పదవికి అక్టోబరు 18న ఎన్నికలు జరగనున్నాయి. కాగా, గత ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలుపొందిన ఇవో మోరెల్స్కు ఈ ఎన్నికల్లో పోటీపై అనర్హత వేటుపడింది. ఇందుకు ఎన్నికల సంఘం చూపుతున్న కారణం... మోరెల్స్ గత రెండు సంవత్సరాలుగా వరుసగా బొలీవియోలో నివాసం ఉండకపోవటంతో ఆయన అక్కడ శాశ్వత పౌరుడుకాదనే వాదనను ఎన్నికల సంఘం ముందుకు తెచ్చింది. మోరెల్స్ను గత సంవత్సరం సైన్యం బలవంతంగా రాజీనామా చేయించింది. దాంతో ప్రాణభయంతో ఆయన దేశం విడిచివెళ్ళారు. ప్రస్తుతం ఆయన అర్జెంటీనాలో తలదాచుకుంటున్నారు. ఆయన స్వచ్ఛందంగా దేశం విడిచివెళ్ళలేదు. బలవంతంగా వెళ్ళవలసి వచ్చింది. బొలీవియాలో మోరెల్స్ పార్టీ 'మూమెంట్ టువాడ్స్ సోషలిజం' (యంఏయస్) బలమైనది. మోరెల్స్పై వేటుపడటంతో ఆ పార్టీ లీనారడో లోజా(37)ను నిలబెట్టటానికి సిద్ధమైంది. లాటిన్ అమెరికాలో ప్రగతిశీల, వామపక్షపార్టీల నాయకులను లక్ష్యంగా చేసుకొని ఎన్నికైన నాయకులను పదవి నుంచి తొలగించటం, లేదా ఎన్నికల్లో పోటీకి ఏదో ఒక కారణం చూపి అనర్హత వేటువేయటం ఆనవాయితీగా మారింది.