Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్యాంకాక్ : థాయిలాండ్ రాజు మహా వజిరాలాంగ్కార్న్ రాచరి కాన్ని బహిరంగంగా సవాలు చేస్తూ వేలా దిమంది ఆందోళన కారులు ఆదివారం బ్యాంకాక్‌లో ప్రదర్శనలు నిర్వహిం చారు. రాజు అధికారా లను తగ్గించేలా సంస్కరణలు తీసుకురావాలని, ప్రధానిని తొలగిం చాలని, కొత్త రాజ్యాంగం తీసుకురావాలని, ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. థాయిలాండ్ రాజభవన చర్యలకు వ్యతిరేకంగా, సైనిక ఆధిపత్యంతో కూడిన పాలనను నిరసిస్తూ గత రెండు మాసాలుగా ప్రదర్శనలు సాగుతున్నాయి. రాన్రాను ఈ ప్రదర్శ నలు మరింత తీవ్రరూపును దాల్చుతున్నాయి. థాయిలాండ్ చట్టాల ప్రకారం రాజును అవమానించడం చట్టవిరుద్ధం. అయినా సరే దీర్ఘకా లంగా అమల్లో వున్న వాటినన్నింటినీ పక్కకు పెట్టి రాజరికాన్ని విమర్శి స్తూ ప్రజలు మరింత ధైర్యంగా ముందుకు వచ్చి తమ నిరసన తెలియచేస్తున్నారు. కాగాదీనిపై తక్షణమే రాజభవనం నుండి ఎలాంటి వ్యాఖ్యలు వెలువడలేదు. ఇక రాజు ఎక్కువ కాలం యూరప్‌లోనే గడుపుతుంటారు. ఆయనకూడా ఇప్పుడు థాయిలాండ్‌లో లేరు. వందలాదిమంది నిరాయుధులైన పోలీసులు ప్రదర్శకులను అడ్డుకున్నారు. వారికే తమ డిమాండ్ల పత్రాన్ని ఆందోళనకారులు అందచేశారు. ఈ విషయంలో ఎలా ముందుకు సాగాలనేదానిపై చర్చించేందుకు పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు లేఖను అందచేస్తామని మెట్రోపాలిటన్ పోలీసు బ్యూరో తెలియచేసింది. 'సామాన్యులమైన మేము రాజరిక సభ్యులకు మా డిమాండ్లను తెలియచేయగలిగాం. ఇదే ఈ రెండు రోజుల్లో మేం సాధించిన విజయం' అని ఆందోళన నేతలు తెలిపారు. 'ఈ దేశం ప్రజలదని, అంతేకానీ రాజుకి చెందిన ఆస్తి కాదని వారు ప్రజల్ని మోసం చేస్తున్నారని' పేర్కొంటూ ఒక శిలాఫలకాన్ని బ్యాంకాక్ లోని గ్రాండ్ పాలస్ సమీపంలో ఆందోళనకారులు ఆదివారం నెలకొల్పారు.
టిక్‌టాక్ ఎప్పటిలానే కొనసాగవచ్చు : ట్రంప్
అమెరికాలో ఎప్పటిలానే ఇకముందు కూడా టిక్‌టాక్‌ను తన కార్య కలాపాలను కొనసాగించుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీ కరించారు. టిక్‌టాక్ మాతృ సంస్థ అయిన బైట్డ్యాన్స్అమెరికా కంపెనీ లకు టిక్‌టాక్‌లో కొన్ని వాటాలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.