Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికాలో కరోనా మరణాలు సంఖ్య 20 లక్షలకు చేరువైంది. జాన్స్ హోప్కిన్స్ విశ్వవిదాలయం గణాంకాల ప్రకారం ఆది వారం సాయంత్రానికి అమెరి కాలో 1,99,479 మంది కరోనాతో మరణించారు. కరోనా బాధితుల సంఖ్య 60 లక్షల 70 వేలు దాటింది. శనివారం కొత్తగా 41 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే రోజువారీ కేసులు, మరణాలు సంఖ్య భారీగా తగ్గింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం గతంలో కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఉతాహ్, మోంటనా రాష్ట్రాల్లో గతంలో కంటే అత్యధిక రోజువారీ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఇంగ్లండ్‌లో కేసులు పెరుగుతుండటంతో రెండోసారి దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు ప్రభుత్వం యోచిస్తుంది.