Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్షతను నిరాకరించిన పాలస్తీనా
జెరూసలేం: అరబ్ లీగ్ సమావేశాలకు సభ్యదేశాలు వంతులవారీగా అధ్యక్షత వహిస్తాయి. అందులో భాగంగా రాబోయే ఆరు నెలలపాటు జరిగే సమావేశాలకు పాలస్తీనా విదేశాంగ మంత్రి అధ్యక్షత వహించాల్సి వున్నది. అమెరికా ప్రోద్బలంతో యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ (యూఏఈ), బహ్రెయిన్ వారం రోజుల క్రితం ఇజ్రాయిల్‌తో సంబంధాల్లో సాధారణ స్థితి ఏర్పడేలా చేసుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ పాలస్తీనా ఈ నిర్ణయం తీసుకున్నది. తమ దేశం అధ్యక్షత వహించాల్సిన సమావేశంలో ఈ నిర్ణయం అమలు గురించి చర్చించటం తమకు అవమానకరమని పాలస్తీనా ప్రకటించింది.