Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్: మిన్నియాపాలిస్ నగరం అమెరికాలోనిది. ఈ ఏడాది మే 25న నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ను ఓ తెల్లజాతి పోలీసు కిందపడేసి అతని గొంతును మోకాలితో తొక్కిపట్టి చంపేసిన విషాద ఘటన ఈ నగరంలోనే జరిగింది. దాని తరువాత అక్కడ ఇప్పటివరకు ప్రతిరోజూ నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. 'నల్లజాతీయుల ప్రాణాలు కూడా విలువైనవి' అన్న నినాదం నిరసనల్లో మారుమోగుతున్నది. దాని ఫలితంగా మిన్నియాపాలిస్ నగర కౌల్సిల్ పోలీసు వ్యవస్థను రద్దుచేస్తూ ఏకగ్రీవంగా తీర్మానంచేసింది. ప్రత్యామ్నాయంగా సామాజిక ప్రజా రక్షణ వ్యవస్థను ఏర్పాటుచేయనున్నారు. అందుకు కావాల్సిన విధివిధానాల రూపకల్పన పనిలో ఉన్నారు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తెస్తే.. మార్పు జరుగుతుందనే దశ దాటిపోయిందని కౌన్సిల్ సభ్యులు ప్రకటించారు. పోలీసు వ్యవస్థలో జాతి విభేదాలు విచ్ఛలవిడిగా కొనసాగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. రక్షణ వ్యవస్థలో తమ వంతు సహాయం అందించాలనే కోరిక ఉన్న పౌరులకు కూడా సామాజిక ప్రజా రక్షణ వ్యవస్థలో అవకాశం కల్పించనున్నట్టు సమాచారం.