Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు అమెరికన్ నగరాల్లో వెల్లువెత్తిన ఆందోళనలు
లూయిస్విల్లె : బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమానికి చిహ్నంగా మారిన ఎమర్జన్సీ రూమ్ టెక్నీషియన్ అయిన బ్రియన్నా టేలర్ హత్యపై వివాదాస్పద రూలింగ్ ఇవ్వడం మెరికాలోని పలు నగరాల్లో ఆందోళనలకు ఆజ్యం పోసింది. అమెరికా నగరమైన లూయిస్విల్లెలో రాత్రి 120మందికి పైగా అరెస్టు చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు. బ్రియన్నా టేలర్ హత్యకు సంబంధించి ఎవరిపైనా అభియోగాలు మోపలేదని గ్రాండ్ జ్యూరీ ప్రకటించడంతో అమెరికావ్యాప్తంగా వర్ణ వివక్షపై న్యాయం కావాలంటూ తాజాగా డిమాండ్లు తలెత్తాయి. న్యూయార్క్, వాషింగ్టన్, లాస్ఏంజెల్స్లతో సహా పలు నగరాల్లో బుధవారం నిరసన ద్రర్శనలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో టేలర్ స్వస్థలమైన కెంటుకీలోని లూయిస్విల్లెలో ఆమెను ఆమె అపార్ట్మెంట్లోనే కాల్చిచంపారు. అక్కడ కూడా నిరసనలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమానికి ప్రతీక అయిన టేలర్‌కు న్యాయం జరగాలని కోరుతూ వేలాదిమంది ప్రజలు నగర వీధుల్లోకి వచ్చారు. సెర్చ్ వారంటుతో అర్ధరాత్రి వేళ మఫ్టీలో ముగ్గురు పోలీసులు టేలర్ అపార్ట్‌మెంట్‌కు వెళ్ళారు. ఆ తర్వాతే మార్చి 13న ఆమె చనిపోయి కనిపించారు. ఆమె హత్యకు సంబంధించి ఎవరిపైనా అభియోగాలు మోపరాదని నిర్ణయించినట్లు గ్రాండ్ జ్యూరీ ప్రకటించడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. తొలుత శాంతియుతంగా ప్రారంభమైన ప్రదర్శనలు తర్వాత హింసాత్మకంగా మారాయి. తరచుగా ఆందోళనకారులు భద్రతా సిబ్బందితో ఘర్షణ పడుతున్నారు. ఫ్లాష్బాంగ్ గ్రెనెడ్లను ఉపయోగిస్తున్నారు. ఈ ఘర్షణలో ఇద్దరు పోలీసు అధికారులపై కాల్పులు జరిగాయి. కానీ వారి ఆరోగ్యం నిలకడగానే వుందని అధికారులు తెలిపారు. మొత్తంగా 127మందిని అరెస్టు చేసినట్లు పోలీసు ప్రతినిధి మైఖేల్ తెలిపారు. వీరిలో పోలీసు అధికారులపై కాల్పులు జరిపిన అనుమానితుడు కూడా వున్నట్లు భావిస్తున్నామని తెలిపారు. అయితే అదుపులోకి తీసుకున్నవారిలో ఇద్దరు జర్నలిస్టులు కూడా వున్నారని తెలిసింది.
హత్య జరిగిన ఆరు మాసాలు గడిచిన తర్వాత బుధవారం గ్రాండ్ జ్యూరీ తీర్పు చెబుతూ ఎవరిపైనా అభియోగాలు నమోదు చేయడం లేదని ప్రకటించారు. దీంతో గురువారం నిరసనలు వెల్లువెత్తాయి. బ్రియానో హత్యకు సంబంధించి జ్యూరీ ఏమీ మాట్లాడలేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
టేలర్ పక్క అపార్ట్మెంట్లో కాల్పులు జరిపిన డిటెక్టివ్ బ్రెట్ హన్కిన్సన్పై అభియోగాలు మోపినట్లు మాత్రమే జ్యూరీ తెలిపింది. అంతేకానీ హన్కిన్సన్ లేదా మరో ఇద్దరు అధికారులకు ఈ హత్యకు సంబంధమున్నట్లు పేర్కొనలేదు. కొంతజరిగింది, కానీ జరగాల్సినంత జరగలేదని లాస్ఏంజెల్స్ లాకర్స్ గార్డ్ డేనీ గ్రీన్ విలేకర్లతో వ్యాఖ్యానించారు.