Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెంటకీ ప్రతినిధి సహా 24మంది అరెస్టు
లూయిస్ విల్లె : మార్చిలో హత్యకు గురైన బ్రియాన్ టేలర్ కేసులో నిందితులైన పోలీసు అధికారులపై అభియోగాలను కొట్టేస్తూ గ్రాండ్ జ్యూరీ ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా శనివారం కూడా నిరసనలు హోరెత్తాయి. ఈ సందర్భంగా అట్టికా స్కాట్తో సహా 24 మందిని లూయిస్విల్లే పోలీసులు అరెస్టు చేశారు. కెంటకీ రాష్ట్ర ప్రతినిధుల సభలో డెమొక్రాటిక్ పార్టీ తరఫున ఉన్న ఏకైక నల్లజాతి మహిళ ఆమె. 'నో నాక్ ' వారెంట్ విధానానికి స్వస్తి పలకాలని, వారెంట్లు జారీ చేసిన పోలీసులకు బాడీ కెమెరాలు తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదిత బ్రియోనా చట్టాన్ని రూపకల్పన చేసిన వ్యక్తి అట్టికా. ఈ బిల్లు 2021లో చట్ట సభ ముందుకు రానుంది. టేలర్ హత్య కేసులో నిందితులుగా ఉన్న పోలీసు అధికారులపై అభియోగాలు మోపేది లేదంటూ బుధవారం గ్రాండ్ జ్యూరీ తీర్పు ఇవ్వడంపై నిరసనలు పెల్లుబికాయి.