Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 16మంది మృతి
బీజింగ్ : వాయవ్య చైనాలో చాంగ్క్వింగ్ మున్సిపాలిటీలోని బొగ్గు గనిలో ఆదివారం చిక్కుకుపోయిన 16మంది గనిలో కార్బన్ మోనాక్సైడ్ స్థాయి ఎక్కువగా వున్నందున మరణించారని అధికార మీడియా తెలిపింది. గనిలోని బెల్ట్ లు కాలిపోవడంతో వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పరిమితి కన్నా మించిపోయిందని, దాంతో లోపల చిక్కుకుపోయిన వారు మరణించారని అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. సంఘటన జరిగిన వెంటనే 75మందితో కూడిన సహాయక బృందం గనిలోకి ప్రవేశించిందని, 30మంది వైద్య సిబ్బంది కూడా అక్కడకు వెళ్ళారని తెలిపింది. అయిత కేవం ఒక్కరిని మాత్రమే కాపాడగలిగామని, వెంటనే అస్పత్రికి తరలించామని పేర్కొంది. రాత్రి 12.30గంటల సమయంలో కార్బన్ మోనాక్సైడ్ స్థాయి ఎక్కువగా వున్నట్లు గుర్తించారు. స్థానిక ఇంధన కంపెనీకి చెందిన సాంగ్జావో బొగ్గు గనిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.