Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రంప్ పన్ను ఎగవేతపై అమెరికా పౌరుల్లో ఆగ్రహం
- ట్రెండింగ్‌లో ఐ పెయిడ్ మోర్ ట్యాక్సెస్ దెన్ ట్రంప్ హ్యాష్‌ట్యాగ్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పన్ను చెల్లింపునకు సంబంధించి అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనంపై విసత చర్చ జరుగుతోంది. కొన్ని సంవత్సరాల్లో అసలు ఆయన ఆదాయ పన్నే చెల్లించలేదని, మరికొన్నిసార్లు వచ్చిన ఆదాయంతో సంబంధం లేకుండా తక్కువ పన్ను చెల్లించారన్న కథనంపై అమెరికా పౌరుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా సామాజిక మాధ్యమాల వేదికగా డెమోక్రాట్ల నుంచి ఉపాధ్యాయులు, కాఫీ షాపు వర్కర్ల వరకూ విమర్శలు చేస్తున్నారు. ట్రంప్‌నకు చెంపపెట్టుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఐ పెయిడ్ మోర్ ట్యాక్సెస్ దెన్ ట్రంప్(ట్రంప్ కంటే నేనే ఎక్కువ పన్ను చెల్లించాను) అన్న హ్యష్‌ట్యాగ్ సోమవారం భారీగా ట్రెండింగ్ అయింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌నకు ఎదురుదెబ్బగా భావిస్తున్న ఈ అంశాన్ని డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి జోరు బిడెన్ గ్రూప్ తమ ప్రచారపర్వంలో వినియోగించుకుంటోంది. ఐ పెయిడ్ మోర్ ట్యాక్సెస్ దెన్ ట్రంప్ అన్న పేరుతో కొత్త ప్రచారానికి తెరలేపింది. ఆదాయం ఉన్నా కూడా పన్ను చెల్లించపోవడం సరికాదని, తాను పన్ను చెల్లించాల్సి వస్తే అది అందరికి ఎందుకు ఉండదు? అని రిటైర్టు ఆర్మీ అధికారి రిజినాల్డ టైసన్ అన్నారు. పర్యావరణవేత్త, బిలీనియర్ టామ్ స్టైయ్యర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. నవంబర్ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌నకు బుద్ధి చెప్పాలని దేశ పౌరులకు పిలుపునిచ్చారు. 2017లో ట్రంప్ కంటే అధనంగా తాను 3.2 కోట్ల డాలర్ల మేర ఫెడరల్ ట్యాక్సుల రూపంలో చెల్లించానని చెప్పారు. 2016, 17 సంవత్సరాల్లో ట్రంప్ కేవలం 750 డాలర్లు మాత్రమే పన్ను చెల్లించారని న్యూయార్కు టైమ్స కథనం వెలువరించింది. వ్యాపారంలో నష్టాలు వచ్చాయని ట్రంప్ ప్రకటించిన పలు సంవత్సరాల తరువాత కూడా ఆయన ఈ విధంగా పన్ను చెల్లించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తనను తాను సమర్ధించుకుంటూ ట్రంప్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తాను లక్షల డాలర్లను పన్నుల రూపంలో చెల్లించానని, తనకు అప్పుల కంటే ఆస్తులే ఎక్కువ ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఇందుకు సంబంధించి ఫైనాన్సియల్ స్టేట్మెంట్ల సాక్ష్యాధారాలను ఇస్తానని మాత్రం ఆయన చెప్పలేకపోయారు.