Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెనీవా : ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. 24గంటల్లో మొత్తంగా 3,38,779కేసులు పెరగగా, యూరప్ వీటిల్లో ముందంజలో వుంది. యూరప్‌లో ఏకంగా 96,996 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఇదే అత్యధిక రికారు. గతంలో అంటే అక్టోబరు 2న కొత్త కేసుల రికార్డు 3,30,340గా వుంది. ప్రస్తుతం భారత్, బ్రెజిల్, అమెరికా కన్నా చాలా ఎక్కువగా యూరప్‌లో కేసులు నమోదవుతు న్నాయి.
భారత్‌లో కొత్త కేసులు 70,496 కాగా, బ్రెజిల్లో 41,906, అమెరికాలో 38,904 కేసులు నమోదవుతున్నా యని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. దేశాలవారీ డేటాను విశ్లేషించి చూసినట్టయితే 54 దేశాల్లో కరోనా ఇన్ఫెకన్లు పెరుగుతున్నాయి.