Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ కుటుంబం, ప్రధాని ప్రయూత్ చాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు
- అరెస్టు చేసిన పౌరహక్కుల కార్యకర్తల్ని విడుదల చేయాలని డిమాండ్
- నిరసనలు చేపట్టరాదంటూ అత్యవసర పరిస్థితి విధించిన ప్రభుత్వం
బ్యాంకాక్ : థాయిలాండ్‌లో ప్రజా ఆందోళనలు రోజు రోజుకూ ఉధృతమవుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని బ్యాంకాక్‌లో ప్రధాని ప్రయూత్ ఛాన్, రాజు మహా వజ్రలోంకోర్న్కు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. పోలీసుల్ని పెద్ద సంఖ్యలో మోహ రించి బలప్రయోగానికి దిగినా..నిరసనలు ఆగటం లేదు. బ్యాంకాక్‌లోని అతిపెద్ద షాపింగ్ మాల్ కూడలి వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొబైల్ స్మార్ట్ఫోన్లలో టార్చ్‌లైట్‌ను వెలిగించి వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. 40మందికిపైగా పౌర హక్కుల కార్యకర్తల్ని అరెస్టు చేయటాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. అరెస్టు చేసిన కార్యకర్తల్ని వెంటనే విడుదల చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. బ్యాంకాక్ సహా పలు నగరాల్లో ఒక చోట పోలీసులు అడ్డుకుంటే, మరోచోట నిరసనలు మొదలవుతు న్నాయి. ప్రధాని ప్రయూత్ ఛాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, ప్రస్తుత ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసి..ఎన్నికలు నిర్వ హించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. రాజ కుటుంబం కనుసన్నుల్లో నడుస్తున్న ప్రభుత్వ పాలనకు ముగింపు పలికి, ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటుచేయాలని వారు వీధుల్లో ఉద్యమి స్తున్నారు. థాయిలాండ్‌లో 2014లో జరిగిన తిరుగుబాటుకు ప్రస్తుత ప్రధాని ప్రయూత్ఛాన్ నేతృత్వం వహించారు. ఆయన తిరుగుబాటుకు సైన్యం, రాజ కుటుంబం పెద్ద ఎత్తున అండదండలు అందించాయి. తద్వారా తమకు అనుకూలమైన వ్యక్తులతో రాజకుటుంబం ప్రభుత్వా న్ని ఏర్పాటుచేసుకోగలిగింది. దీనిపై ప్రజల్లో పెద్ద ఎత్తున ఆగ్రహజ్వా లలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా రాజధాని బ్యాంకాక్‌లో గత మూడు నెలలుగా నిరసన ర్యాలీలు ఆగటం లేదు. వీటిని అడ్డుకోవటం కోసం ప్రధాని ప్రయూత్ దేశంలో గురువారం రాత్రి అత్యవసర పరిస్థితి విధించారు.
వెనక్కి తగ్గేది లేదు..
బ్యాంకాక్ నిరసనలపై అక్కడి ప్రముఖ రాజకీయ నాయకుడు మైక్ రేయాంగ్ మాట్లాడుతూ, ''దేశంలో మళ్లీ ప్రజాస్వామ్య పాలన రావాలి. ఇందుకోసమే
మా పోరాటం. ప్రధాని ప్రయూత్ రాజీనామా చేయాలన్నదే ప్రధాన డిమాండ్. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. ఇందుకోసం జరుగుతున్న పోరాటం నుంచి వెనక్కి మరలే ప్రసక్తే లేదు. నిరసనలు ఆపం. పోలీసు బలప్రయోగాన్ని చూసి భయపడి పారిపో''మని అన్నారు.