Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : చైనా సైనిక - అనుబంధ నిపు ణులపై అమెరికా కోర్టులలో విచారణను వెంటనే నిలి పివేయాలని, లేదంటే తమ దేశంలోని అమెరికన్లను అదుపులోకి తీసుకుంటామంటూ చైనా హెచ్చ రిస్తుందని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఈ అంశానికి సంబంధించి చైనా అధికారులు అమెరికా ప్రభుత్వ అధికారులను పలు చానెళ్ల ద్వారా పదే పదే హెచ్చరికలు జారీ చేశారని వార్తాపత్రికలో తెలిపింది. అయితే పేర్లు వెల్లడించేందుకు నిరాకరించింది. చైనా ప్రభుత్వం అమెరికా పౌరులను, ఇతరులను విదేశీ ప్రభుత్వాలపై బేరాసారాలు సాగించేందుకు వీలుగా వారిని ఏకపక్షంగా నిర్బంధించడం, బహిష్కరించడం వంటివి చేస్తుందని అమెరికా విదేశాంగ శాఖ సలహాదారు పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం స్పందించలేదు. ప్రపంచంలోనే ప్రథమ ఆర్థిక, సైనిక శక్తిగా ఉన్న అమెరికా స్థానాన్ని కొల్లగొట్టేందుకు చైనా యత్నిస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అమెరికా సాంకేతిక, సైనిక, ఇతర నైపుణ్యాలను దొంగిలించేందుకు చైనా సైబర్ దాడులు చేస్తోందని, గూఢచర్యానికి పాల్పడుతోందని ఆయన వాదిస్తున్నారు.
అయితే ఈ ఆరోపణలు చైనా ప్రభుత్వం ఖండించింది. జులైలో అమెరికా విద్యా సంస్థల్లో పరిశోధన చేసేందుకు వీసాల కోసం దరఖాస్తు చేసిన సమయంలో.. ముగ్గురు చైనా పౌరులు తమ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో సభ్యత్వాలను దాచిపెట్టారంటూ , దీంతో వారిని ఎఫ్బిఐ అదపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత నెలలో వెయ్యిమందికి పైగా చైనా పౌరుల వీసాలను అమెరికా రద్దు చేసిందని, ఈ చర్యలను మానవహక్కుల ఉల్లంఘనగా చైనా వ్యాఖ్యానిస్తోంది.