Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రసీలియా : ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు సంయు క్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో ఒక వలంటీర్ మరణించినట్లు బ్రెజిల్ హెల్త్ అథారిటీ అన్విసా బుధవారం తెలిపింది. ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించింది. వలం టీరు మృతిచెందిన అనంతరమూ వ్యాక్సిన్ పరీక్షలు కొనసాగనున్నాయని రెగ్యులేటరీ పేర్కొంది. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వ్యక్తుల వివరాలను రహస్యంగా ఉంచాలని, దీంతో మరిన్ని వివరాలు అందించలేమని అన్విసా తెలిపింది. వలంటీర్ స్థానికుడేనని బ్రెజిల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షల సమన్వయకర్తగా ఉన్న ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ సావోపా తెలిపింది. దీంతో ఆస్ట్రాజెన్‌కా షేర్స్ ఒక్ససారిగా కుప్పకూలాయి.