Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : కరోనా కట్టడి చేసేందుకు అతి త్వరగా వ్యాక్సిన్ను తీసుకొచ్చేందుకు వివిధ దేశాలు ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనికా సంయుక్తగా అభివృద్ది చేస్తున్న టీకా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రముఖ బ్రిటన్ పత్రిక ద సన్ తెలిపింది. ఈ టీకాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని ఓ ప్రముఖ ఆసుపత్రికి ఆదేశాలు వెళ్లాయని ఆ పత్రిక తెలిపింది. ఆ దేశ ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) నవంబరు 2 నుంచి ప్రారంభమయ్యే వారంలో ఆస్ట్రాజెనికా టీకాల తొలి దశ పంపిణీ చేపట్టడానికి సిద్ధమవుతున్నట్టు పత్రిక తెలిపింది.