Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాలో అమెరికా రికార్డు
వాషింగ్టన్ : గురువారం నాటికి అమెరికావ్యాప్తంగా దాదాపు 90వేల మంది కొవిడ్ రోగులు ఆస్పత్రుల్లో చేరారని కొవిడ్ ట్రాకింగ్ ప్రాజెక్టు వర్గాలు తెలిపాయి. వరుసగా 16వ రోజు ఇదొక కొత్త రికార్డు అని పేర్కొన్నాయి. బుధవారం నాటి మృతుల సంఖ్య 2,284కి చేరుకోగా, మే 7 తర్వాత ఇదే అధికమని తెలిపాయి. వచ్చే నాలుగు వారాల్లో ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం(సిడిఎస్) తెలిపింది. డిసెంబరు 19తో ముగిసే వారంలో 10,600 నుండి 21,400 మధ్యలో కొత్త మృతులు వుండవచ్చునని పేర్కొంది. డిసెంబరు 19నాటికి మొత్తంగా మృతుల సంఖ్య 2,94,000 నుండి 3,21,000 మధ్యలో వుండవచ్చని సిడిఎస్ అంచనా వేసింది. రాష్ట్రాలవ్యాప్తంగా 50శాతం కేసులు పెరిగాయి.