Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా లక్షలాది మందికి వ్యాక్సిన్ వేయడానికి సిద్ధమవుతున్న బ్రిటన్ ప్రభుత్వం శనివారం వ్యాక్సిన్ మినిస్టరును నియమిం చింది. కన్జర్వేటివ్ సభ్యుడు నదీమ్ జాహవిని వ్యాక్సిన్ మంత్రిగా నియమిస్తున్నట్లు ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఫైజర్, బయోటెక్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లపై ఇంగ్లండ్ మెడిసిన్ రెగ్యులేటరీ దృష్టిపెట్టింది. ఫైజర్ తొలి డోసు డిసెంబర్ 7న అందుబాటులోకి వచ్చేవీలుందని గార్డియన్ వార్తా సంస్థ తెలిపింది.