Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- థాయిలాండ్లో భారీ ర్యాలీ
బ్యాంకాక్ : అరెస్టు వారంట్లు, హింసాత్మక దాడులు, బెదిరింపులెన్ని వచ్చినా లెక్క చేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం థాయిలాండ్ ప్రజలు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. బుధవారం ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల్లో ఇద్దరు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. ప్రధాని ప్రయూత్ చాన్ ఒచా ఆయన ప్రభుత్వం గద్దె దిగాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగాన్ని మరింత ప్రజాస్వామ్యయుతంగా సవరించాలని, రాచరిక వ్యవస్థ మరింత జవాబుదారీగా వుండేలా సంస్కరణలు తీసుకురావాలని వారు కోరుతున్నారు. రాచరిక వ్యవస్థను కాపాడేందుకు సైన్యం ప్రయత్నిస్తోంది. రాజు మహా వజిరా లాంగ్కార్న్ తనకు లేని అధికారాలను చెలాయించజూస్తున్నారని నిరసనకారులు పేర్కొంటున్నారు. రాచరిక వ్యవస్థ పరువు ప్రతిష్టలను దిగజారుస్తున్నారంటూ 12మందిపై కేసులు పెట్టారు.