Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెన్సిల్వేనియాలో రిపబ్లికన్ల పిటిషన్ కొట్టివేత
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ట్రంప్ మద్దతుదారులు వేసిన మరో పిటిషన్ను పెన్సిల్వేనియా సుప్రీం కోర్టు శనివారం తోసిపుచ్చింది. దీంతో ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తానంటూ ట్రంప్ చేస్తున్న వాదనల్లో పస లేదని స్పష్టమైంది. పెన్సిల్వేనియాలో మెయిల్లో వచ్చిన బ్యాలెట్లను చెల్లనివిగా ప్రకటించాలని రిపబ్లికన్లు తమ పిటిషన్లో కోరారు. లేదా అన్ని ఓట్లను లెక్కించకుండా పక్కకు పెట్టి విజేత ఎవరో నిర్ణయించేందుకు రాష్ట్ర చట్టసభను అనుమతించాలని ఆ పిటిషన్ కోరింది. కోర్టు ఆ రెండు డిమాండ్లను ఏకగ్రీవ నిర్ణయంతో కొట్టిపారేసింది. పైగా, సార్వత్రిక ఎన్నికల్లో పెన్సిల్వేనియా ఓటర్లు వేసిన దాదాపు 69లక్షల ఓట్లను గుర్తించవద్దంటూ చేసిన ప్రతిపాదన చాలా అసాధారణంగా వుందంటూ కోర్టు వ్యాఖ్యానించింది. మెయిల్ ద్వారా ఓటు వేయడం రాజ్యాంగ విరుద్ధమని 2019లో చేసిన పెన్సిల్వేనియా చట్టం పేర్కొంటోందంటూ రిపబ్లికన్ పిటిషన్ వాదించింది. నవంబరు 21వ తేదిన ఈ చట్టాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం చాలా ఆలస్యమైందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. పెన్సిల్వేనియాలో బైడెన్ విజయం సాధించారని నవంబరు 24న అధికారికంగా పెన్సిల్వేనియా అధికారికంగా ప్రకటించింది.