Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలిఫోర్నియా న్యాయస్థానంలో ఎదురుదెబ్బ
- హెచ్ 1బీ వీసాలపై ఊరట
న్యూయార్క్ : అమెరికాలో వలసలు, నిరుద్యోగాన్ని అదుపులో పెట్టేందుకు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న వీసా నిర్ణయాలకు కాలిఫోర్నియా సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ ఉద్యోగుల నియామకానికి సంబంధించిన హెచ్ 1బీ వీసాలపై అధ్యక్షుడు విధించిన ఆంక్షలను ఇక్కడి న్యాయస్థానం కొట్టివేసింది. ఈ నిబంధనల అమలుకు ముందు ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ట్రంప్ సర్కార్ తగినంత సమయం కేటాయించలేదనీ.. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి జెఫ్రీ వైట్ వెల్లడించారు. అమెరికన్లకు ఉద్యో గ భద్రత కల్పించేందుకంటూ విదేశీ నిపుణులకు కూడా స్థానికులతో సమానంగా వేతనాలు చెల్లించాలనే నిబంధన విధించటంతో వాణిజ్య సంస్థలు ఇరుకున పడ్డాయని న్యాయమూర్తి తెలిపారు. కోవిడ్-19 వల్ల ఉద్యోగాల సంఖ్యపై కోత పడిందనీ.. తద్వారా నిరుద్యోగం తీవ్రమయ్యే ప్రమాదముందని ట్రంప్ ప్రభుత్వం వాదించింది. దీని నుంచి తప్పించుకొనేందుకు అంటూ ఈ సంవత్సరాంతం వరకు హెచ్ 1బీ, ఇతర విదేశీ వీసాలను రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్యతో వీసా దరఖాస్తుల సంఖ్య మూడో వంతుకు పడిపోతుందని ఆశించారు. అయితే ఈ వాదనను ట్రంప్ ప్రభుత్వం నిరూపించలేకపోయిందని ధర్మాసనం స్పష్టం చేసింది.