Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెంటగాన్ ఆమోదం
వాషింగ్టన్ : ఆఫ్ఘనిస్తాన్లో సైనిక బలగాల కుదింపునకు సంబంధించిన ప్రణాళికను పెంటగన్ ఆమోదించింది. ఈ ప్రణాళిక కింద రెండు పెద్ద సైనిక స్థావరాలు అమెరికన్ మిలిటరీ అధీనంలోనే వుంటాయి. జనవరి 15కల్లా అమెరికా సైనికుల సంఖ్యను 2500కి తగ్గించాలన్న అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలను అధికారులు అమలు చేయనున్నారని అమెరికా ఉన్నత సైనిక జనరల్ బుధవారం తెలిపారు. ప్రస్తుతం ఆఫ్ఘన్లో వున్న 4,500మంది సైనికుల్లో దాదాపు సగం మందిని తగ్గించాలని గత నెల్లో ఎన్నికల అనంతరం ట్రంప్ నిర్ణయించారు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం, ఆఫ్ఘన్లో రెండు పెద్ద స్థావరాలు తమ అధీనంలోనే వుంటాయని ఆర్మీ జనరల్ మార్క్ మిల్లే తెలిపారు. అయితే, ఏ స్థావరాలను మూసివేసేది ఆయన ఇదమిత్థంగా తెలపలేదు.