Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్జెంటీనా చారిత్రాత్మక నిర్ణయం
బ్యూనస్ఎయిర్స్: అబార్షన్లను చట్టబద్ధం చేస్తూ అర్జెంటీనా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. లాటిన్ అమెరికన్ దేశాల్లో ఇటువంటి నిర్ణయం తీసుకున్న ప్రధాన దేశం అర్జెంటీనా. అర్జెంటీనా కాంగ్రెస్ సెనేట్ 38 - 29 ఓట్ల తేడాతో ఈ చట్టాన్ని ఆమోదించింది. అబార్షన్లను అనుమతించొద్దనీ, అది శిశువుల జీవించే హక్కును హరించడమేనంటూ కేథలిక్ చర్చ్ వాదిస్తోంది. బ్యూనస్ ఏయిర్స్లోని సెనేట్ భవనం ముందు నిరీక్షిస్తున్న వేలాది మంది ప్రజలు హర్షద్వానాల మధ్య కొత్త చట్టానికి మద్దతు పలికారు. 14 వారాల గర్భం వరకు మహిళలకు అబార్షన్లను అనుమతిస్తూ ఈ చట్టం తీసుకొచ్చారు. 2018లోనే ఈ చట్టం తీసుకొచ్చేందుకు విఫలయత్నం జరిగింది. అప్పుడు ప్రవేశపెట్టిన బిల్లును దిగువసభ ఆమోదించినప్పటికీ స్వల్ప ఓట్ల తేడాతో సెనేట్లో వీగిపోయింది. ఇప్పుడు పాలకపక్షం అనుమతితో బిల్లు ఆమోదం పొందింది. కాగా, ఇది ప్రజారోగ్యానికి సంబంధించిన అంశమనీ, అలాగే మహిళల హక్కులను విస్తృతం చేస్తుందని అర్జెంటీనా ప్రధాని ఫెర్నాండేజ్ చెప్పారు. స్త్రీవాద ఉద్యమాన్ని అణచివేసేందుకు 1921 నుంచి అమలులో ఉన్న ఈ చట్టంలో మార్పులు చేశారని, దీంతో ప్రతి ఏడాది 38 వేల మంది మహిళలు అబార్షన్ల కోసం రహస్యంగా ఆస్పత్రులకు వెళుతున్నారని అన్నారు. ఇదే సమస్యతో ఇప్పటివరకు 3 వేల మందికి పైగా మహిళలు మరణించారని అన్నారు. ఈ చట్టాన్ని రూపొందించిన విల్మా ఇబ్రారా మాట్లాడుతూ.. ఈ చట్టంతో రహస్య గర్భస్రావంలో ఏ మహిళా మరణించదని అన్నారు.