Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కరోనా కేసుల నమోదులో అగ్రరాజ్యం రికార్డులు సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో 2,90, 000 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇప్పటి వరకు నమోదైన రోజువారీ కేసుల్లో ఇదే గరిష్ట సంఖ్య. అదేవిధంగా మరణాల్లో కూడా రికార్డులు నమోదు చేస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 3,676 మరణాలు సంభవించాయి. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 8, 88, 10, 289 మంది కోవిడ్ బారిన పడగా..మరణాల సంఖ్య 19,11,586గా ఉంది. కాగా, నూతన అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్ కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ల పంపిణీ చేపడతామని చెప్పారు.