- గ్రామీణ వృద్ధికి దారితీస్తుంది : ఐఎంఎఫ్ వాషింగ్టన్ : మోడీ సర్కార్ చేసిన నూతన వ్యవసాయ చట్టాలు వ్యవసాయరంగ సంస్కరణల్లో గొప్ప ముందడుగుగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ భావిస్తోంది. ఈమేరకు దీనిపై ఐఎంఎఫ్ అధికార ప్రతినిధి గారీ రైస్ గురువారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆయన ఏమన్నారంటే, నూతన వ్యవసాయ చట్టాలు వ్యవసాయరంగాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాయి. అయితే..ఈ నూతన చట్టాలతో ప్రభావితమయ్యేవారికి సామాజిక రక్షణ మరింత పటిష్టం చేయాల్సిన అవసరముందని అందులో ఆయన పేర్కొన్నారు. కొత్త వ్యవస్థలోకి వెళ్లే క్రమంలో కొన్ని వర్గాలకు జరిగే నష్టంపై దృష్టిసారిం చాలని ఐఎంఎఫ్ సూచించింది. కొత్త చట్టాల వల్ల పంట ఉత్పత్తుల కొనుగోలుదార్లతో రైతులకు నేరుగా సంబంధాలు ఏర్పడతాయని, భారత్‌లో వ్యవసాయ సంస్కరణల్లో ఇదొక మంచి ముందడుగని మీడి యా కాన్ఫరెన్స్‌లో గారీ రైస్ తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయం తొలిగి పోతుందని, తద్వారా రైతులకు లబ్ది చేకూరుతుందని, ఇదంతా కూడా గ్రామీణ వృద్ధికి దారితీస్తుందని ఆయన అన్నారు. అయితే, నూతన చట్టాల వల్ల ప్రభావితమయ్యే వర్గాలకు సామాజిక రక్షణ కల్పించటం చాలా కీలకమని ఆయన అన్నారు. సంస్కరణలతో జరిగే మేలును బట్టి వృద్ధి ఆధారపడి ఉంటుందని, ప్రభావంతంగా, సరైన సమయంలో సంస్కరణలు చేపట్టడమూ కీలకమేనని ఆయన అభిప్రాయపడ్డారు.