Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ దేశ మంత్రిత్వ శాఖపై తాజాగా ఆంక్షలు
వాషింగ్టన్ : మరో మూడు రోజుల్లో అధ్యక్ష గద్దె నుంచి దిగిపోనున్న ట్రంప్ క్యూబాపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల క్యూబాను ఉగ్రవాద దేశాల జాబితాలో తిరిగి చేర్చుతూ నిర్ణయం తీసుకున్న ట్రంప్ ప్రభుత్వం తాజాగా ఆ దేశంపై మరోమారు ఏకపక్ష, నిరంకుశ చర్యలకు పాల్పడింది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ క్యూబా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖతో పాటు ఆ శాఖ మంత్రి జనరల్ లజారో అల్వారెజ్ కాసాస్పై ఆంక్షలు విధించింది. అయితే క్యూబా అంతర్గత వ్యవహారాల శాఖ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినందన్న దానికి ట్రంప్ సర్కార్ ఎటువంటి ఆధారాలు చూపించలేదు. తన ఆదేశాలకు లొంగని దేశాలపై తాను పాల్పడుతున్న చర్యలను సమర్ధించుకునేందుకు అమెరికా ఈ అంశాన్ని పదేపదే సాకుగా చూపిస్తున్నదని విమర్శకులు అభిప్రాయపడ్డారు. మానవ హక్కుల జవాబుదారీతనానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 13818 ప్రకారం క్యూబా మంత్రిత్వ శాఖపై ఆంక్షలు విధించినట్టు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు అమెరికా ప్రభుత్వం తరచుగా చట్టాల్లో ఇది కూడా ఒకటి.