Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బైడెన్ ప్రమాణ స్వీకారానికి సర్వంసిద్ధం
వాషింగ్టన్ : అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన తో పాటు ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ కూడా ప్రమాణం చేస్తారు. బైడెన్-హారిస్ ఎన్నికల ప్రచారం లో కీలకమైన 'అమెరికా ఐక్యత' అనే అంశం ప్రధానం గా అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సన్నాహాలు పూర్తయ్యాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రమాణ స్వీకారమంటే ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే గత కార్యక్రమాలతో పోలిస్తే కరోనా కారణంగా పైగా ఇటీవలి క్యాపిటల్ హిల్‌పై దాడి నేపథ్యంలో ఈ ఏడాది కార్యక్రమం భిన్నంగా ఉండనున్నది. ప్రతి ప్రమాణ స్వీకార కార్యక్ర మంలో మాదిరిగా ఈసారి ప్రజా సందోహం వుండదు. కేవలం వెయ్యిమంది మాత్రమే హాజరవుతారని భావిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది కాంగ్రెస్ సభ్యులు, వారి అతిథులు మాత్రమే వుంటారు. పదవి నుంచి వైదొలగుతున్న అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరుకాకపోవచ్చునని భావిస్తున్నారు.
ప్రమాణ స్వీకారం షెడ్యూల్
అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో (భారత్‌లో రాత్రి 8.30) అధ్యక్షుని ప్రమాణ స్వీకార కమిటీ (పీఐసీ) కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తుంది. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. 11.30 గంటల సమయంలో అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఆహ్వానిస్తారు. ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ సంప్రదాయానుసారం క్యాపిటల్ హిల్‌లో వెస్ట్ ఫ్రంట్ వద్ద బైడెన్ చేత ప్రమాణం చేయిస్తారు. తర్వాత బైడెన్ ప్రారంభ ఉపన్యాసం చేస్తారు.