Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణం
వాషింగ్టన్ డీసీ : అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. బైడెన్‌తో చీఫ్ జస్టిస్ రాబర్ట్స్ ప్రమాణ స్వీకారం చేయిం చారు. ఈ కార్యక్రమానికి క్లింటన్, జార్జ్‌బుష్, ఒబామా కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యా రు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10 గంటలు) లేడీ గాగా జాతీయ గీతాలాపానతో కార్యక్రమం ప్రారం భమైంది. ఆ తర్వాత బైడెన్ సతీమణి జిల్ బైడెన్ ప్రసంగించారు. అనంతరం ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటో మేయర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ప్రజాస్వామ్యం గెలిచిన రోజు
అమెరికాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తా.. అందుకు ప్రజలందరి సహకారం కావాలి.ఇటీవల పార్లమెంట్ భవనంపై జరిగిన దాడి దిగ్భ్రాంతికరం.ఈ రోజు ప్రజాస్వామ్యం గెలిచింది. అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటా. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తా. శ్వేత వర్ణ అహంకారాన్ని తప్పకుండా ఓడిస్తా. కరోనా వల్ల లక్షల ఉద్యోగాలు పోయాయి. ఆర్థిక రంగం కుదేలైంది.ఇలాంటి కష్టకాలంలో ఐకమత్యంతో కలిసి ముందుకెళ్దాం. - బైడెన్