Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాన్బెర్రా: ఫేస్‌బుక్‌తో చర్చలు కొనసాగుతున్నాయని.. దీంతో తమ వార్తలను నిలిపివేయడంపై వెనక్కు తగ్గిందని అస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ శనివారం తెలిపారు. సిడ్నీలో జరిగిన ఒక సమావేశంలో మారిసన్ మాట్లాడుతూ.. ఫేస్బుక్ తిరిగి మాతో స్నేహపూర్వకంగా వ్యవహరించడంపై తాను సంతోషిస్తున్నానని అన్నారు. ఫేస్బుక్ ఆస్ట్రేలియా వార్తలను నిలిపివేయడం, దేశీయ, విదేశీ వార్తాసంస్థల పేజీలను తొలగించడం, దేశీయ, విదేశీ వార్తా సంస్థల పేజీలను తొలగించడంతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వ, అత్యవసర విభాగాల ఖాతాలను కూడా ఫేస్బుక్ తొలగించడంతో ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. గతంలో వార్తా సమచారాల లింక్‌ల కోసం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన ఫేస్బుక్, గూగుల్ చెల్లించాల్సిన నగదుపై అస్ట్రేలియా కొత్త చట్టాన్ని రూపొందించింది. దీంతో ఆగ్రహించిన ఫేస్బుక్ ఆస్ట్రేలియా వార్తలను నిలిపివేసింది. కాగా, తాజాగా తమకు ప్రతిపాదిత చట్టంపై వ్యతిరేకత లేదని ఫేస్బుక్ బహిరంగంగా సూచించింది.