Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో : తనకు విధించిన జైలుశిక్షపై రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ పెట్టుకున్న అప్పీల్‌ను మాస్కో కోర్టు శనివారం తిరస్కరించింది. కాగా, తక్షణమే నావల్నీని విడుదల చేయాలని కోరుతూ యురోపియన్ మానవ హక్కుల కోర్టు ఆదేశించింది. ఈనెల ఆరంభంలోనే దిగువ కోర్టు నావల్నీకి రెండు సంవత్సరాల 8మాసాల జైలు శిక్ష విధించింది. ఆ శిక్షను రద్దు చేసి తనను విడుదల చేయాల్సిందిగా నావల్నీ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ మాస్కో నగర కోర్టు, శిక్షా కాలాన్ని రెండున్నర సంవత్సరాలకు తగ్గించింది. 2015లో గృహ నిర్బంధంలో వున్న నెలన్నర కాలాన్ని ఈ శిక్షా కాలం నుండి తగ్గించింది. ఆయనను అరెస్టు చేయడం, శిక్ష విధించడంపై రష్యావ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అధికారులు వెంటనే పెద్ద ఎత్తున అణచివేత చర్యలకు పాల్పడ్డారు. దాదాపు 11వేల మందిని అరెస్టు చేశారు. వారిలోచాలా మందికి జరిమానా విధించారు. కొంతమంది కొన్ని రోజుల పాటు జైలు శిక్ష విధించారు.