Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : గ్రీన్కార్డ్దారులు అమెరికాలోకి ప్రవేశించకుండా ట్రంప్ విధించిన నిషేధపు ఉత్తర్వులను అమెరికా అధ్యక్షుడు బైడెన్ బుధవారం ఉపసంహరించుకున్నారు. కరోనా మహమ్మారితో నెలకొన్న నిరుద్యోగ సంక్షోభాన్ని అడ్డుకునేందుకు అమెరికా ఉద్యోగాలను రక్షించాల్సిన అవసరం ఉందంటూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ గతేడాది గ్రీన్‌కార్డులపై ఈ నిషేధాన్ని జారీ చేశారు. గ్రీన్‌కార్డు దారులపై నిషేధాన్ని రద్దు చేస్తూ.. ట్రంప్ వాదనను తిరస్కరించారు. ఈ ఉత్తర్వులు అమెరికాలోని కుటుంబాల మధ్య సంబంధాలను నిరోధించడంతో పాటు వ్యాపారాలకు హాని కలిగించాయని అన్నారు. ట్రంప్ తీసుకున్న కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలను తిప్పికొట్టాలని బైడెన్ ప్రతిజ్ఞ చేశారు. మార్చి 31తో గడువు ముగియనున్న వీసా నిషేధాన్ని ఎత్తివేయాలని పలువురు న్యాయవాదులు ఆయనపై ఒత్తిడి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.