Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురు మృతి
కాబుల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్లో నాటోకి చెందిన ప్యూమా ఎంకె2 హెలికాప్టర్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వారిలో ఇద్దరు అమెరికన్లు కూడా ఉన్నారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆఫ్ఘన్ బలగాలకు శిక్షణ ఇచ్చే నాటో ప్రధాన కేంద్రంలో హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా నాటోకు చెందిన రిసోల్యూట్ సపోర్ట్ మిషన్లో భాగంగా బయలుదేరిన ఈ హెలికాప్టర్ సోమవారమే కుప్పకూలిందని ఆఫ్ఘన్ అధికారులు ధృవీకరించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు.