Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యా, చైనాలకు కీలక ఫైల్స్ అందించిన స్నోడెన్
లండన్ : అమెరికా మాజీ ప్రజావేగు, ఇంటెలిజెన్స్ కాంట్రాక్టర్ అయిన ఎడ్వర్డ్ స్నోడెన్ నుంచి లీక్ అయిన ఫైల్స్ రష్యా, చైనాకు చేరాయని బ్రిటీష్ మీడియా ఆదివారంనాడు ఆసక్తికరమైన వార్తల్ని ప్రచురించింది. లీకైన ఫైల్స్లో అత్యంత కీలకమైన సమాచారమున్నట్టు మీడియా కథనాలు వెలు వడ్డాయి. దీంతో బ్రిటీష్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ తమ రక్షణార్థం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు, అప్రమత్తమైనట్టు 'ద సండే టైమ్స్', 'బిబిసి' జూన్ 14న వార్తల్ని ప్రసారం చేసింది. బ్రిటీష్ మీడియా పేర్కొన్న వార్తల సారాంశం ఇలా వుంది...''బ్రిటీష్ ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల భోగట్టా ప్రకారం సీక్రెట్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్, సంబంధిత సమాచారం లీకైంది. దీనివల్ల బ్రిటన్, అమెరికాకు చెందిన గూఢాచారులను గుర్తించే అవకాశాలున్నాయి. వారి అనుపానులు తెలియజేసే సమాచారం రష్యా, చైనాకు చేరిపోయింది'' అని మీడియా కథనాలు వెలువడ్డాయి. గూఢాచార కార్యకలాపాల నిర్వహణపై బ్రిటన్, అమెరికా దేశాల ఏజెంట్ల సమాచారాన్ని రష్యా, చైనా పొందాయని బిబిసి పేర్కొంది.