Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుతిన్, జిన్పింగ్ ఉద్ఘాటన
మాస్కో: తమకు ఎదురవుతున్న సవాళ్లను కలిసికట్టుగా అధిగమించేందుకు ప్రయత్నిస్తామని రష్యాఅధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు సీ జిన్పింగ్ ఉద్ఘాటించారు. ఇక్కడ జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో కూటమి సభ్యదేశాల మధ్య సహకారంపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం పుతిన్ మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక రంగంలోనూ, అంతర్జాతీయ రాజకీయాల్లోనూ ఎదురవుతున్న సవాళ్లపై తమకు పూర్తి అవగాహన వుందన్నారు. తాము కలిసికట్టుగా పనిచేస్తే అన్ని సమస్యలను అధిగమించి తమలక్ష్యాలను సాధిస్తామని ఆయన అన్నారు. ఈ సమావేశంలోనే పాల్గొన్న సీ మాట్లాడుతూ అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేస్తూ ప్రపంచ వ్యాప్తంగా శాంతి కొనసాగేందుకు తాము కలిసి కృషి చేస్తామని చెప్పారు.